Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు గంటలపాటు నిలిచిపోయిన రాకపోకలు
- బస్సులు సమయానికి నడపాలని డిమాండ్
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
సరైన సమయానికి బస్సులు రాకపోవడంతో పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దింతో గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సాధిక్, విద్యార్థులతో కలిసి గంభీర్ పూర్, పోతారం గ్రామాల మధ్య రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సుమారు 2 గంటల వరకు రోడ్డుపై రాకపోకలు నిలిచిపోగా ప్రయాణికులకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సాధిక్ మాట్లాడుతూ కొత్తపల్లి నుండి దుబ్బాక వరకు బస్సులు టైం కి రావడం లేదని, దింతో సమయానికి రాక పోవడంతో పాఠశాలకు, కళాశాలలకు ప్రతిరోజు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల, పాఠశాలలకు టైం కు అందక విద్యార్థులు చదువులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
మరో వైపు ఈ విషయాన్ని విద్యార్థులు అనేకసార్లు దుబ్బాక డిపో మేనేజర్ కు ఎన్నోసార్లు చెప్పిన ఏ విధమైన సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. దాదాపు రహదారిపై రెండు గంటల పాటు విద్యార్థులు ధర్నా నిర్వహించడంతో విషయం తెలుసుకున్న గంభీర్పూర్ గ్రామ సర్పంచ్ కరిక భాస్కర్ అక్కడికి చేరుకొని ఆర్టీసీ డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడగా డిపో మేనేజర్ శుక్రవారం నుండి కొత్తపల్లి నుండి దుబ్బాక వరకు పాఠశాల సమయానుకూలంగా బస్సులు నడిపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో విద్యార్థులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాకేష్, గోపి ,ఆయా పాఠశాల, కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.