Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రావల్పిండిలో పాకిస్థాన్ తో నేడు ప్రారంభమైన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ రికార్దును సొంతం చేసుకుంది. టెస్టు మ్యాచ్ తొలిరోజే 500 పరుగులు చేసిన మొదటి జట్టుగా రికార్డు చాటుకుంది. ఆస్ట్రేలియా పేరిట 112 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ఇంగ్లాండ్ కూల్చేసింది. 1910లో దక్షిణాఫ్రికాపై ఆసీస్ జట్టు తొలిరోజున 494 పరుగులు చేసింది.
రావల్పిండిలో ఇవాళ ప్రారంభమైన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వెలుతురు లేమి కారణంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగులు చేసింది. ఏకంగా నలుగురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేయడం విశేషం. ఓపెనర్లు జాక్ క్రాలే (122), బెన్ డకెట్ (107) తొలి వికెట్ కు 233 పరుగుల భారీ భాగస్వామ్యంతో పటిష్ఠ పునాది వేయగా, ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఓలీ పోప్ (108) కూడా శతకం సాధించాడు. మాజీ సారథి జో రూట్ 23 పరుగులకే అవుట్ కాగా, తొలి రోజు ఆట చివర్లో కొత్త కుర్రాడు హ్యారీ బ్రూక్ (101 బ్యాటింగ్) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి జోడీగా క్రీజులో బెన్ స్టోక్స్ ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ 15 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు.