Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెరాస, కాంగ్రెస్ మరో ప్రతిపక్ష పార్టీ నాయకులకు, ప్రజల చేతిలో శిక్ష తప్పదు
- ములుగు డి సి ఓ ప్రజాధనాన్ని దోపిడీతో కంపెనీ చలామణి, పద్ధతులు మార్చుకో
నవతెలంగాణ- తాడ్వాయి
ఏజెన్సీలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట హెచ్చరిక కరపత్రాలు విడుదల అయ్యాయి. ఏజెన్సీలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల గుండెల్లో గుబులు రేపుతుంది. అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా లేనిపోని సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ బోదెయిన బుచ్చయ్య, పెనుమల్ల రామకృష్ణారెడ్డి, కావేరి అర్జున్, దుర్గం రమణయ్య, కాంగ్రెస్ నాయకులు అర్రెం లచ్చు పటేల్, బొల్లు దేవేందర్, ఏటూరునాగరం ఇర్సవడ్ల వెంకన్న, లు అక్రమ దందాలకు పాల్పడుతున్నారని పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని ఆ లేఖలో హెచ్చరించారు.
గ్రామాల్లో ప్రజలను యువతను తప్పుదారి పట్టిస్తూ వర్గాలుగా విభజించి కాంట్రాక్టర్లలో మరియు డిసిఒ లో చేతులు కలిపి గ్రామంలో ఇదివరకే ఇసుక సొసైటీ ఉన్నా కూడా మరొక సొసైటీ చేయటం కొరకు డిసిఒకు సొసైటీకి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఇది తప్పని ఎదురు తిరిగిన యువతను మావోయిస్టులులో సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరించి కేసులు పెట్టి యువతను బనాయిస్తున్నారని ఆరోపించారు. కావిరి అర్జున్, లచ్చు పటేల్, బొల్లు దేవేందర్, హిరసవడ్ల వెంకన్న వీరు వీధ పార్టీల్లో ఉంటూ ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఇసుక వ్యాపారం కొరకు వివిధ కాంట్రాక్టర్ల పేరుతో విచ్చలవిడిగా పనులు చేసుకుంటూ పార్టీ సమాచారం మొత్తం కూడా సేకరించి విశ్వ జిత కమిటీ స్టేషన్ రవీందర్ పోలీస్ అధికారులకు సమాచారం చేరవేస్తూ, పార్టీ సభ్యులను అరెస్టులు చేపిస్తూ ,పోలీసుల వద్ద నుండి డబ్బులు తీసుకుంటూ, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగరం, మంగపేట మండలాల్లో వ్యాపారస్తుల వద్ద లక్షల రూపాయలను తీసుకొని వారికి ఎదురు వచ్చిన వారిని చంపుతామని బెదిరింపులకు గురిచేస్తూ, భూకబ్జాలు చేస్తూ భూమి సెటిల్మెంట్స్ చేస్తూ లక్షలు రూపాయలు దండుకుంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు.
టిఆర్ఎస్ నాయకులు దుర్గం రమణయ్య, ఇంద్రారెడ్డి పోలీస్ వారితో ఉంటూ వారి కావలసిన సమాచారం ఇస్తూ ఏమి కావాలన్నా మీకు మేము సహాయం చేస్తామని, మీ సపోర్టు మాకు చేయాలని ఒక అండర్స్టాండింగ్ చేసుకొని, భూకబ్జాలకు పాల్పడి అక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు అధికార పార్టీల నాయకులతో ఉంటూ, ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తూ ముడుపుల మత్తులో ఊగుతున్నారని పేర్కొన్నారు.
వెంకటాపురం, వాజేడు, ఏటూర్ నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాలలో తాసిల్దారులు గిరిజనులో భూమి సమస్యలు ఎస్ డి సి కోర్టులో లేని అడ్డంకులను సృష్టించి తమాషా చేస్తూ, ఎంజాయ్ చేస్తూ పబ్బం గడుపుతున్నారని కరపత్రంలో పేర్కొన్నారు. స్వయంగా జిల్లా కలెక్టరే ఒక గ్రామంలో ఒక ఇసుక సొసైటీ ఉండాలని సర్కులర్లు తీసి మరల డి సి ఓ తో సొసైటీ ఉన్న గ్రామంలో మరొక సొసైటీ ఏర్పాటు చేపిస్తూ గిరిజన గ్రామాలలో ప్రజలకు, అధికారులు, కాంట్రాక్టర్లు గొడవలు పెట్టేస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో రెండు ఇసుక సొసైటీలు లేకుండా, ఒక గ్రామంలో ఒక సొసైటీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్తగా ఏర్పాటు చేసిన ఇసుక సొసైటీలను జిల్లా కలెక్టర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ కరపత్రంలో హెచ్చరించింది.
పైన తెలిపిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు పద్ధతి మార్చుకోకుంటే, పి ఎల్ జి ఏ వారోత్సవాలలో మీకు గోరి కట్టగా తప్పదనే హెచ్చరించారు. నేటి నుండి జరుగుతున్న పి ఎల్ జి ఏ వారోత్సవాల్లో ప్రజలు ప్రజాస్వామిక వాదులు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.