Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో మిగిలిన సీట్ల భర్తీకోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు విద్యార్థి సేవల విభాగం ఇన్‌చార్జ్ డైరెక్టర్ ఎల్‌వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారు, రిజిస్టర్ చేసుకోని ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 8న ఉదయం 10.00 గంటలకు వర్సిటీలోని వెంకట్రామ్ ఆడిటోరియంలో స్పాట్ అడ్మిషన్ కేంద్రంలో హాజరుకావాలని తెలిపారు. అడ్మిషన్లు పొందినవారు స్లైడింగ్ ద్వారా తమ అధ్యయన కేంద్రాలను మార్చుకోవచ్చని, మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.