Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మవరంలో కంటైనర్‌ను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కంటైనర్‌ను కత్తిపూడి వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ డివైడర్ మీద నుంచి దూసుకొచ్చి ఢికొట్టిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. కాగా, ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.