Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రూ.28.51 కోట్ల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. బోయిన్‌పల్లిలో రూ.5.55కోట్లతో వర్షపునీటి డ్రైన్ నిర్మాణం, మానససరోవర్ కాలనీ వద్ద రూ.1.92కోట్లతో కల్వర్టు నిర్మాణం, హస్మత్‌పేటలోని బోయిని చెరువుకు రూ.2.56కోట్లతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం, రూ.10కోట్లతో బాలాజీనగర్ డివిజన్‌లోని రంగధాముని చెరువు అభివృద్ధి పనులు, బాలాజీనగర్‌లో రూ.2కోట్లతో మహిళా పార్కు నిర్మాణ పనులు, రూ.1.95కోట్లతో కేపీహెచ్‌బీ భువన విజయం మైదానం వద్ద షటిల్ కోర్టు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కేపీహెచ్‌బీ డివిజన్ 7వఫేజ్‌లో రూ.3.5కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన హిందూ శ్మశాన వాటిక, 9వఫేజ్‌లో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.