Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండాలో చిరుతపులి హల్ చల్ చేసింది. గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసింది. అంగోత్ బన్సీ అనే వ్యక్తి గొర్రెలను మేతకు మేపుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో చిరుత పులి దాడి చేసింది. స్థానిక గొర్రెల కాపరులు గమనించి ఆరవడంతో పారిపోయింది. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందజేశారు. చిరుతను బంధించేందుకు బోన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే ప్రాంతంలో రెండు రోజుల క్రితం చిరుత పులి రెండు పిల్లలతో సంచారం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.