Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను డ్రగ్ డిస్పోజల్ కమిటీ (డ్రగ్స్ ధ్వంసం కమిటీ) ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీసీఎస్, డీడీ జాయింట్ కమిషనర్ గజరావు భూపాల్ నేతృత్వంలో 1,500 కిలోల గంజాయి, 1,100 మిల్లీ లీటర్ల హ్యాష్ ఆయిల్, 500 గ్రాముల ఎండీఎంఏ దుండిగల్‌లోని హైదరాబాద్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎన్విరో ఇంజనీర్ లిమిటెడ్ (రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ విభాగం)లో ధ్వంసం చేశారు. ఇవి 10 పోలీస్‌స్టేషన్లలో నమోదైన 45 ఎన్‌డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలని జాయింట్ సీపీ తెలిపారు.