Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాన్పూర్: భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఒక మహిళపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి, అతని సోదరుడు రిజ్వాన్ సోలంకి పోలీసుల ముందు లొంగిపోయారు. ఇవాళ ఉదయం కాన్పూర్ కమిషనర్ క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన నిందితులు.. కమిషనర్ ముందే లొంగిపోయారు. ఓ భూమికి సంబంధించి ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి, అతని సోదరుడు రిజ్వాన్ సోలంకిలకు ఒక మహిళతో వివాదం ఉంది. ఈ క్రమంలో వారు గత నెల మహిళపై బెదిరింపులకు పాల్పడటమేగాకుండా, ఆమె ఇంటికి నిప్పుపెట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు ఇవాళ లొంగిపోయారు.