Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు సమీప జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బెంగళూరు నుంచి విజయవాడకు వస్తున్న ఓ ప్రయివేట్ బస్సు బోల్తాపడడంతో గుంటూరుకు చెందిన ఒకరు దుర్మరణం చెందారు. పలువురికి స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.