Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. గడిచిన ఎనిమిది నెలల హుండీ ఆదాయాన్ని పరిశీలించగా రూ.1,161 .74 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ యేడాది హుండీ ఆదాయం రూ.1600 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2019-20లో వచ్చిన రూ. 1,313 కోట్ల ఆదాయమే అత్యధికమని వివరించారు. ఆగస్టు నెలలో అత్యధికంగా రూ. 140.34 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.