Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువతిని సకాలంలో రక్షించి ప్రాణాలు కాపాడిన మాదాపూర్ పోలీసులను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. కమిషనరేట్‌లో గురువారం వారికి రివార్డులు అందజేశారు. రేత్‌బౌలి ప్రాంతానికి చెందిన ఇంటర్ యువతి హర్షిత(19) మానసిక ఒత్తిడి కారణంగా నవంబర్-29న కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లి చెరువులో దూకింది. లేక్ పెట్రోలింగ్ కానిస్టేబుల్ నవీన్‌కుమార్ వెంటనే మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ తిరుపతికి సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ భానుప్రకాశ్, కానిస్టేబుల్ నవీన్, తెలంగాణ టూరిజం బోటు డ్రైవర్ మనోహర్, హైదరాబాద్ యాచ్ క్లబ్ రజనీకాంత్ కలిసి చెరువులో గాలించారు. యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రాణాలకు తెగించి యువతి ప్రాణాలు కాపాడిన పోలీసులను అప్రమత్తం చేసిన ఇన్‌స్పెక్టర్ తిరుపతిని సీపీ అభినందించారు. సిబ్బందికి రివార్డులు అందజేశారు.