Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కవితతో కలిసి హరీశ్ రావు నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ నెల 7న జరిగే కేసీఆర్ బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లను వీరు పరిశీలించారు. ఈ తరుణంలో హరీశ్ రావు మాట్లాడుతూ బీజేపీ రాజకీయాలు దేశంలో అందరికీ తెలుసని, ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీలు, ఐటీలతో ఆ పార్టీ దాడులు చేయించడం సహజమేనని అన్నారు. అంతేకాదు బీజేపీ వదిలే బాణాలు, పెట్టించే పార్టీలు కూడా ఉంటాయని పరోక్షంగా వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలని విమర్శించారు. బీహార్, యూపీలాంటి రాష్ట్రాల్లో అయితే బీజేపీ బాణాలు, పార్టీలు, కుట్రలు నడుస్తాయని ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ ఇక్కడ అవి నడవవన్నారు.