Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీ20ల్లో 600కు పైగా వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా బ్రావో రికార్డు నమోదు చేయడం తెలిసిందే. అయితే వచ్చే సీజన్ కు బ్రావోను చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేసింది. అంతేకాకుండా అతడ్ని కొత్త బౌలింగ్ కోచ్ గా సీఎస్కే నియమించింది. దీంతో ఐపీఎల్ కు బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్త పాత్ర పట్ల బ్రావో ఎంతో సంతోషాన్ని ప్రకటించాడు. ఈ తరుణంలో బ్రావో మాట్లాడుతూ నేను ఈ కొత్త ప్రయాణం కోసం వేచిచూస్తున్నాను. బౌలర్లతో కలసి పనిచేయడాన్ని నేను ఆస్వాదిస్తాను. ఈ రోల్ పట్ల నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఆటగాడి నుంచి కోచ్ పాత్రకు మారడం అంటే సర్దుకుపోవాలనేమీ అనుకోవడం లేదు. ఎందుకంటే ఆటగాడిగానూ తోటి బౌలర్లతో కలిసే పనిచేశాను. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన వాడిగా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐపీఎల్ చరిత్రలో భాగంగా ఉన్నందుకు సంతోషిస్తున్నానన్నారు.