Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీలోని గుంటూరు, విజయవాడలోని పలు ఆస్పత్రులు, పలువురి ఇళ్లపై శుక్రవారం ఈడీ, ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గుంటూరులోని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఈడీ, ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా సోదాలు నిర్వహించారు. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన అధికారులు, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి పాత మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలో ఈడీ తనిఖీలు చేపట్టారు.
కొవిడ్ సమయంలో భారీగా అవకతవకలు జరిగాయని గుర్తించిన అధికారులు ఈ దాడులు నిర్వహించారు. సుమారు 1500 మంది కొవిడ్ కేసులకు చెందిన వివరాలను నమోదు చేయాలేదని వారికి కంప్యూటర్ రసీదులు కాకుండా మాన్యువల్ రసీదులు, నకిలీ రసీదులతో నిధులు పక్కదారి పట్టించారని కేసులు నమోదు అయ్యాయి. ఆస్పత్రుల నిర్వహణకు వచ్చిన నిధులు పక్కదారి పట్టించి ఇతర భవనాల కోసం వెచ్చించినట్లు, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ సీట్లకు సంబంధిన ఫీజుల విషయంలో నిధుల గోల్‌మాల్ జరిగిన దరుణంలో దాడులు చేసినట్లు తెలుస్తుంది.