Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతామణి నాటకాన్ని ఒక సామాజికవర్గం మనోభావాలు దెబ్బతీనే విధంగా నాటకం ఉందనే కారణంతో నిషేధం విధించిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారణలో రఘురాజు తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర కోర్టులో వాదనలు వినిపించారు.
చింతామణి ఒక సందేశాత్మక నాటకమని దాన్ని నిషేధించడం సరికాదని అన్నారు. నాటకాన్ని నిషేధించడం వల్ల ఎంతో మంది కళాకారుల ఉపాధి దెబ్బతిన్నదని, వ్యభిచారం నిరోధానికి కూడా ఈ నాటకం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఒక కులం మనోభావాలు గాయపడ్డాయని నాటకాన్ని నిషేధిస్తే ఇతర కులాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని, అందువల్ల ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని కోరారు. వాదనలను విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.