Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢీల్లి: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇటీవల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు రాడ్ మార్ష్, షేన్ వార్న్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. సెప్టెంబరు 2020లో ఆసీస్ మాజీ బ్యాటర్ డీన్ జోన్స్ మరణించాడు. అలాగే, వెస్టర్న్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్, నెదర్లాండ్స్ కోచ్ ర్యాన్ క్యాంప్‌బెల్ కూడా గుండెపోటుతో ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ తరుణంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ గ్రేట్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర అవస్వస్థతో ఆస్పత్రిలో చేరాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టుకు చానల్ 7లో కామెంటరీ చెబుతున్న పాంటింగ్ లంచ్ సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు డైలీ టెలీగ్రాఫ్ ను చూపిస్తూ ఫాక్స్ స్పోర్ట్స్ తెలిపింది. మ్యాచ్ మూడో రోజైన నేడు (శుక్రవారం) కొంత అస్వస్థతగా ఉండడంతో ఎందుకైనా మంచిదని గుండె చెకప్ కోసం పాంటింగ్ ఆస్పత్రికి వెళ్లినట్టు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది.ప దీంతో ఇక పాంటింగ్ అనారోగ్యానికి గురయ్యాడని, మ్యాచ్ మిగతా కామెంటరీకి అందుబాటులో ఉండడని ఛానల్ 7 అధికార ప్రతినిధి ప్రకటించారు.