Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి నిడదవోలు వరకు చంద్రబాబు భారీ రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా గజమాలలు, మంగళహారతులతో జనం నీరాజనం పలికారు. ఈ తరుణంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన ఐదేళ్ల శనిని వదిలించుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని మండిపడ్డారు. ఒక సైకో ఊరికో సైకోని తయారు చేస్తున్నాడని వైకాపా సైకోలను భూ స్థాపితం చేసే వరకూ తాను పోరాడుతానని స్పష్టం చేశారు.
వైకాపా పాలనలో ఊరికొక సైకోను తయారు చేస్తున్నారు. సైకో దెబ్బకు కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. అమరరాజా బ్యాటరీస్ రూ.9,500 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇలా అయితే, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? అమరరాజా పరిశ్రమను గత సీఎంలు ప్రోత్సహిస్తే జగన్ వేధిస్తున్నారు. ఏపీ వ్యక్తి వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వెళ్లారు. నారాయణ విద్యాసంస్థల అధినేతనూ వేధిస్తున్నారు. రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. పోలవరం పూర్తి చేయాలని రాత్రి, పగలు పని చేశా. రైతులకు నీరు ఇచ్చేందుకు ఎంతో దూరదృష్టితో వ్యవహరించా కానీ, ఈ సీఎం పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుందని బాధగా ఉంది. కానీ, ప్రజల ఉత్సాహం చూస్తే వెయ్యి ఏనుగుల బలం వస్తోంది. యువత భవిష్యత్తు కాపాడేందుకే వచ్చా అని చంద్రబాబు మాట్లాడారు.