Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ పైపైకి ఎగబాకుతోంది. ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నాయిస్ ఇప్పుడు విరాట్ కోహ్లీతో జట్టు కట్టింది. నాయిస్ స్మార్ట్ వాచ్ లకు కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినంత కాలం నాయిస్ ఉత్పత్తులకు కోహ్లీ అన్ని రకాలుగా ప్రచారం చేయనున్నాడు. తమ సంస్థకు ప్రచారకర్తగా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ వ్యవహరించనుండడం తమను ఉద్విగ్నతకు గురిచేస్తోందని నాయిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖత్రీ అన్నారు. ఇప్పుడు నేను అధికారికంగా నాయిస్ మేకర్ ను అయ్యాను. ఈ నాయిస్ నన్ను కూడా కదిలించింది. భారత్ లో నెం.1 స్మార్ట్ వాచ్ బ్రాండ్ లో ఇప్పుడు నేను ఒక భాగమే అని కోహ్లీ ట్వీట్టర్ ద్వారా తెలిపాడు.