Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మద్రాస్ హైకోర్టు శుక్రవారం సంచలన ఆదేశాలు వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుళ్లలోకి భక్తులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాలయాల పరిశుద్ధత, పవిత్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో పాటు ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని కూడా తెలిపింది.
ఇప్పటికే తమిళనాడులోని తిరుచెందూర్ ఆలయంలోకి ఫోన్లను అనుమతించడం లేదు. భక్తులతో పాటు ఆలయంలో పనిచేసే సిబ్బంది కూడా గుడిలోపలికి ఫోన్లు తీసుకురావద్దని నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో తిరుచెందూర్ ఆలయ ముఖ్య అధికారి మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు, భక్తులు, ఆలయ సిబ్బంది ఫోన్లను గుడి బయట డిపాజిట్ చేసేందుకు సెక్యూరిటీ కౌంటర్ ఏర్పాటు చేశామని, టోకెన్లు కూడా ఇస్తున్నామని, ఒకవేళ ఎవరిదగ్గరైనా ఫోన్ దొరికితే ఆ ఫోన్‌ను వాళ్లకు తిరిగి ఇవ్వమని, అలాగే భక్తులు మనదేశ సంస్కృతికి అద్దంపట్టే దుస్తులు వేసుకోవాలని కోరుతూ గుడి ఆవరణలో నోటీస్ బోర్డులు పెట్టించాం అని స్పష్టం చేశారు.