Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బ్రిటన్ రాజధాని లండన్‌లో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు ప్రపంచ బ్యాంకుల సమావేశం జరిగింది. ఈ తరుణంలో భారత్ విభాగానికి సంబంధించి బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2022ను కెనరా బ్యాంక్ సోంతంచేసుకుంది. గత 12 నెలల్లో సంబంధిత భౌగోళికాల్లో బ్యాంకు సేవలు, రిటర్న్‌లు, వ్యూహ్యాలు, ఆవిష్కరణలు, సాంకేతికతలను అందించగల సామర్థ్యాన్ని బట్టి విజేతలను నిర్ణయిస్తారని, ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు కెనరా బ్యాంక్ ఎంపికైనట్లు పేర్కొంది. ఈ సందర్భంగా తమ ఖాతాదారులు, పెట్టుబడిదారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.
అయితే ఈ నెల 1న లండన్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో ఎల్‌వీ ప్రభాకర్ ఈ అవార్డును స్వీకరించారు. ఆస్కార్ అవార్డుతో సమానమైన బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సాధించడంతోపాటు ఈ ఏడాది దేశంలోనే బెస్ట్ బ్యాంక్‌గా నిలిచినందుకు తామెంతో గర్విస్తున్నట్లు కెనరా బ్యాంక్ తెలిపింది.