Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇటీవల టాలీవుడ్ అగ్రశ్రేణి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్య సౌజన్యకు బహుమానంగా తన విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారును అందించారు. ఈ కారు ధర రూ.1.34 కోట్లు అని తెలుస్తోంది. బీఎండబ్ల్యూ ప్రతినిధులు కొన్నిరోజుల కిందట కారును సౌజన్యకు డెలివరీ ఇచ్చారు. త్రివిక్రమ్ భార్య సౌజన్య దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కుమార్తె అని తెలిసిందే. ఈ పెళ్లికి సంధానకర్త సిరివెన్నెలే. సౌజన్య మొదట్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. ఆమె భరతనాట్య కళాకారిణి. పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు.