Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి (కన్నెపల్లి) పంప్ హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించడానికి ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈనెల 15వ తేదీ నుంచి విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయనున్నట్లు తెలిసింది. వానాకాలంలో వచ్చిన వరదల కారణంగా పంప్‌హౌస్ నీట మునగడంతో మోటార్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని మోటార్లకు మరమ్మతులు పూర్తవ్వగా, ట్రయల్ రన్ కూడా నిర్వహించినట్లు తెలిసింది. పంప్‌హౌస్ ఫోర్‌బేలోకి నీటిని మళ్లించి డ్రైరన్, వెట్‌రన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం.