Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళ: సాంకేతిక లోపంతో స్పైస్‌జెట్ విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సౌదీ అరేబియా దేశంలోని జెడ్డా నుంచి కోజికోడ్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా 197 మంది ప్రయాణికులున్నారు. ఈ విమానం శుక్రవారం రాత్రి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ లో హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని విమానాశ్రయ ప్రతినిధి చెప్పారు. కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన స్పైస్‌జెట్-ఎస్‌జి 036 విమానాన్ని కొచ్చికి మళ్లించిన తర్వాత ఇక్కడి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.ఈ సందర్భంగా కొచ్చి విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.ఎమర్జెన్సీ ల్యాండింగ్ పరిస్థితి తర్వాత విమానం 19.19 గంటలకు రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.