Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. వైద్యాధికారులతో కొత్తగూడెం కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నాటికి సీహెచ్‌సీల మరమ్మత్తుల పనులు, అశ్వారావుపేట ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడ కూడా టిఫ్పా, రేడియాలజీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ప్రతీ ఆస్పత్రి క్లీన్‌గా ఉండాలని, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. దీనిలో డీఎంఈ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, సూపరింటెండెంట్ కుమారస్వామి, డీసీహెచ్‌ఎస్ రవిబాబు, డీఎంహెచ్‌వో దయానందస్వామి పాల్గొన్నారు.