Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ నెల 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా శనివారం నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు అవినీతి నిరోధక శాఖ డీజీ అంజనీ కుమార్ శుక్రవారం తెలిపారు. దానికి సంబంధిత వాల్ పోస్టర్‌ను ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అవినీతిని నిర్మూలిద్దాం- దేశాన్ని అభివృద్ధి చేద్దాం అనే నినాదంతో ఈ కరపత్రాలను రూపొందించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో వీటిని అంటించి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని తెలిపారు. అవినీతి అధికారుల సమాచారాన్ని టోల్‌ఫ్రీ నెంబరు 1064 లేదా వాట్సాప్ నెంబరు 9440446106 ద్వారా తమకు అందించాలని సూచించారు.