Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, వయోజన శాఖను స్త్రీ సంక్షేమ శాఖ నుంచి విభజిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
దీంతో దివ్యాంగులు, వయోజనులకు ప్రత్యేక శాఖ ఏర్పాటు కానుంది. ప్రత్యేక శాఖతో వారి సంక్షేమానికి సత్వర నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉండనుంది. ఈ శాఖ సమర్థంగా సేవలందించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటుకానుండగా ఒక జిల్లా అధికారిని కూడా నియమించనున్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖను స్వతంత్ర శాఖగా ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకోవడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.