Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏలూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఆయిల్‌పాం తోటలో రెండు దశాబ్దాల క్రితం నాటివిగా భావిస్తున్న 18 బంగారు నాణేలు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన మానుకొండ తేజస్వికి చెందిన ఆయిల్‌పాం తోటలో పైపులైను కోసం తవ్వుతుండగా చిన్న మట్టిపిడత దొరికింది. అందులో 18 బంగారు నాణేలు ఉన్నాయి. దీంతో ఆమె భర్త సత్యనారాయణ వెంటనే తహసీల్దారుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దారు మట్టిపిడతను పరిశీలించారు. అందులోని ఒక్కో నాణెం 8 గ్రాములకు పైనే ఉన్నట్టు నిర్ధారించారు. అయితే ఇవి కొయ్యలగూడెం మండలం ఏడువాడల పాలెం గ్రామ పరిధిలో గత నెల 29న లభ్యం కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.