Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12 వేదికల్లో ఎస్సై, కానిస్టేబుళ్ల ఈవెంట్లు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నియామక ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి కీలకమైన అంశాల(ఈవెంట్స్) నిర్వహణలో వడబోత విధానం అమలు చేయబోతోంది. గతంలా అన్నింటిలో పాల్గొనే అవకాశమిచ్చేందుకు బదులు ఈసారి వడబోతను అనుసరించబోతోంది.
వీటిలో తొలుత పరుగుపందెం నిర్వహించనున్నారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళలు 800 మీటర్ల పరుగును నిర్ణీత కాలంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. పరుగుపందెంలో ఉత్తీర్ణులైతేనే శారీరక కొలతల అంకానికి అనుమతించనున్నారు. అవి కూడా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీలకు అర్హత దక్కుతుంది. అనంతరం ఈ రెండు ఈవెంట్లను విజయవంతంగా పూర్తి చేయగలిగితేనే తుది రాతపరీక్షకు అవకాశం ఉండనుంది.