Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గతంలో సిటీ బస్సులను తగ్గించిన తరుణంలో అదనంగా ఉన్న డ్రైవర్లను వివిధ జిల్లాల్లో కొరత ఉన్న డిపోలకు డిప్యుటేషన్‌పై పంపిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్‌లో కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో జిల్లాల్లోని వివిధ డిపోల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న 232 మంది డ్రైవర్లను తిరిగి గ్రేటర్ హైదరాబాద్ డిపోల్లో విధుల్లో చేరాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. వీరిని తక్షణం విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆయా ఆర్‌ఎంలకు సూచిస్తూ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది.