Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం తెలుగు యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి సాహిత్యరంగం నుంచి ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, 2021 సంవత్సరానికి ప్రసిద్ధ సంగీత రికార్డుల సేకరణకర్త, కళావిమర్శకులు వీఏకే రంగారావుకు విశిష్ట పురస్కారాలను అందజేశారు. అనంతరం రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మాతృభాషను మరవద్దని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు తెలుగువారికి జీవనాడులన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీతో పాటు మరో వెయ్యి ఉద్యోగాలను అదనంగా నియమించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు.