Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులపై న్యాయపరంగా, రాజకీయపరంగా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కవిత ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం. అంతే కాకుండా తాజాగా సీబీఐ నోటీసులపై స్పందిస్తూ కవిత స్వాగతించారు.