Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న సంస్థలో పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 46 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్, ఎండీ, డీఎం, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎన్‌బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. అనస్థీషియాలజీ, బయోకెమిస్టీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, మెడికల్ జెనెటిక్స్, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.
ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,01,500 వరకు చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 17-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.