Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా చేస్తున్న సామాజిక సేవ అందరికీ తెలిసిందే. తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గరేత్ ఒవెన్ సందర్శించారు. ఈ తరుణంలో ఆయన కూడా రక్తదానం చేశారు. అక్కడున్న వైద్యులు ఆయనకు బ్లడ్ బ్యాంక్ పని తీరును వివరించారు. ఈ సందర్భంగా ఒవెన్ మాట్లాడుతూ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ కు విచ్చేసినందుకు ఒవెన్ కు ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం చేస్తూ లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.