Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పేదరికం కారణంగా పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ కు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా వస్తున్న వలసదారులను పోలీసులు అరెస్టు చేసి బహిష్కరిస్తున్నారు. దాంతో వారు కానరీ దీవులకు శరణార్థులుగా వలస వెళ్తున్నారు. ఈ తకుణంలో ముగ్గురు శరణార్థులు ఓడ వెనుక కూర్చుని దాదాపు 3,200 కిలోమీటర్లు ప్రయాణించి కానరీ దీవులకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు శరణార్థుల పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది. నైజీరియాలోని లాగోస్ నుండి కానరీ ద్వీపానికి ముగ్గురూ ఆయిల్ ట్యాంకర్ అలిదిని-2 వెనుక భాగంలో ప్రయాణించారు. దాదాపు 11 రోజుల పాటు అన్నం, నీళ్లు లేకుండా రాత్రుళ్లు ప్రయాణం సాగించారు. దాదాపు 3,200 కి.మీ సముద్ర ప్రయాణం చేశారు. ఇలా వారు సజీవంగా కానరీ దీవులకు ఎలా చేరుకోగలిగారో చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.
దీంతో వారి పరిస్థితి విషమించడంతో అక్కడి స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ శరణార్థులకు ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది 11,600 మంది సముద్ర మార్గంలో తమ దేశంలోకి ప్రవేశించారని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదించింది. వీరిలో వేలాది మంది ఆఫ్రికన్ శరణార్థులు ఉన్నట్లు సమాచారం.