Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రేపటి (ఆదివారం) నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు తొలి వన్డే, ఈ నెల 7న రెండో వన్డే, ఈ నెల 10న మూడో వన్డే జరగనున్నాయి. మూడే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. మూడు మ్యాచ్‌లు ఒకే వేదికపై మీర్‌పూర్‌లోని షేర్ ఏ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ జట్టు తాత్కాలిక కెప్టెన్ లిటన్ కుమార్ దాస్ వన్డే సిరీస్ ట్రోఫీని ఆవిష్కరించారు. బంగ్లా జట్టు రెగ్యులర్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో లిటన్ దాస్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా జరగనుంది.