Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి కిటికీ అద్దాల నుంచి లోపలకు చొచ్చుకొచ్చిన ఓ ఇనుప కడ్డీ మెడలో గుచ్చుకుని అతడి ప్రాణం పోయిన ఘటన దిల్లీ సమీపంలో చోటు చేసుకుంది. దిల్లీలోని సుల్తాన్‌పుర్‌కు చెందిన హరికేశ్ దుబే (34) శుక్రవారం ఉదయం దిల్లీ నుంచి కాన్పూర్ వెళ్లే నీలాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. ప్రయాగ్‌రాజ్ డివిజన్ పరిధిలోని దన్వర్-సోమ్నా స్టేషన్ల మధ్యలో 8.45 నిమిషాలకు ఒక ఇనుప కడ్డీ హఠాత్తుగా బోగీలోకి దూసుకొచ్చి హరికేశ్ మెడలోకి చొచ్చుకుపోయింది. దీంతో క్షణాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అలీగఢ్ జంక్షన్‌లో రైలును ఆపి మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. లఖ్‌నవూలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని దుబే బంధువు తెలిపారు.