Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: లిఫ్ట్‌లో చిక్కుకున్న బాలుడు సహాయం కోసం కేకలు వేశాడు. చివరకు కొన్ని నిమిషాల తర్వాత ఆ బాలుడ్ని రక్షించారు. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన గేట్రల్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం నిరాలా ఆస్పైర్ సొసైటీకి చెందిన లిఫ్ట్‌లో పదేళ్ల బాలుడు చిక్కుకున్నాడు. ఈ తరుణంలో బలవంతంగా లిఫ్ట్ డోర్లను తెరిచేందుకు ప్రయత్నించాడు. విఫలం కావడంతో సహాయం కోసం గట్టిగా అరిచాడు. చివరకు పది నిమిషాల తర్వాత ఆ బాలుడ్ని లిఫ్ట్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా, ఈ ఘటనపై ఆ సొసైటీ వివరణ ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం 5.44 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. లిఫ్ట్‌లోకి వెళ్లిన బాలుడు తన సైకిల్‌తో లిఫ్ట్ డోర్‌ను కొట్టాడని, దీంతో ఐదో అంతస్తు మధ్యలో చిక్కుకున్నదని పేర్కొంది. ఈ క్రమంలో లిఫ్ట్‌ను వినియోగించే పిల్లలు లిఫ్ట్ డోర్‌కు కాస్త దూరంగా ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించింది.