Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కన్నడ మాతృకగా విడుదలైన కాంతార అక్కడ కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. సెప్టెంబర్ 30వ తేదీన అక్కడ విడుదలైన ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చినా థియేటర్లలో ఉండటం విశేషం. తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 15వ తేదీన ఇక్కడ థియేటర్లలో దిగిపోయిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత నుంచి చాలా రోజుల పాటు అదే వసూళ్ల జోరును కొనసాగించింది. మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
అలాంటి ఈ సినిమా తెలుగులో ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొంతసేపటి క్రితం అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. అడవి ప్రాంతంలోని ఆచార విశ్వాసాలకు సంబంధించిన కథనే అయినా, మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడమే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి ప్రధానమైన కారణమని చెప్పుకోవచ్చు.