Congratulations Jakkanna @ssrajamouli. This is just the beginning of your journey to worldwide glory. It’s time for the world to know what I knew about you all along. https://t.co/QhHtncQHYw
— Jr NTR (@tarak9999) December 3, 2022
Authorization

హైదరాబాద్: దర్శక ధీరుడు రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ లభించింది. ఆస్కార్ బరిలో నిలవడానికి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న టైంలో జక్కన్నకి ఈ అవార్డ్ రావడం కలిసొచ్చే విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ లాంటి అసోసియేషన్ నుంచి అవార్డ్స్ రావడం చాలా ముఖ్యం.
ఇది ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి మంచి బూస్ట్ ఇస్తుంది. జక్కన్నకి అవార్డ్ రావడంతో ఇండియన్ సెలబ్రిటీస్ ట్వీట్స్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో గోండు వీరుడిగా కనిపించి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ కూడా రాజమౌళికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. నీ గురించి ఇన్ని రోజులు నాకు తెలిసినది, ఇప్పడు ప్రపంచం తెలుసుకునే సమయం ఆసన్నమయ్యింది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.