Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. సామాన్యులు, నేతలు పోలింగ్ బూత్‌లకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఓటర్ లిస్టులో ఆయన పేరు లేదని సిబ్బంది చెప్పడంతో షాకయ్యారు. పోనీ డిలీటెడ్ లిస్టులో అయినా ఆయన పేరు ఉందా అంటే అది కూడా లేదు. ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడి ఓటు కూడా గల్లంతవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన పేరు ఓటర్ లిస్టులోగానీ, డిలీటెడ్ లిస్టులోగానీ లేదని, ఏం జరిగిందనే విషయంలో అధికారులు చెక్ చేస్తున్నారని అనిల్ చౌదరి చెప్పారు. అనిల్ చౌదరితోపాటు డల్లుపుర పోలింగ్ బూత్‌కు వచ్చిన ఆయన భార్య మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లో గత 15 ఏండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొన్నది.