Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నో విశిష్టతలకు నెలవని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయన్నారు. విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ప్రభుత్వం తరఫున పౌరసన్మానం చేశారు. గవర్నర్ బిశ్వభూషన్.. రాష్ట్రపతిని సత్కరించి మెమొంటో అందజేశారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్యం దేశవ్యాప్త ఖ్యాతి గడించిందన్నారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని రాష్ట్రపతి అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు. దేశంలోని అన్ని భాషల్లో తెలుగు శ్రేష్టమైనదని చెప్పారు. కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రనను సర్మించుకున్నారు. మొల్ల, దుర్గాభాయ్, సరోజినీ నాయుడు వంటి మహనీయుల గొప్పదనాన్ని కీర్తించారు. మొల్ల రామాయనం పేరుతో మహాకావ్యం రచించారని, దానికి భారతీయ సాహిత్యంలో అగ్రస్థానం దక్కిందని వెల్లడించారు. గురజాయ రచించిన కన్యాశుల్కం నాటకం ప్రజల మన్ననలు పొందిందని చెప్పారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ స్వాతంత్య్ర సంగ్రామంలో తనవంతు పాత్ర పోషించారని తెలిపారు. ఆంధ్ర మహిళా సభను స్థాపించారన్నారు. సరోజినీ నాయుడు ఉప్పు సత్యాగ్రహంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు.