Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రూ.234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. పలు షెల్ కంపెనీల సాయంతో నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నిధుల మళ్లింపు వ్యవహారంపై విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది. సోమవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులలో సూచించింది.