Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నిర్వహణ పనుల కారణంగా ఈనెల 4వ తేదీన వివిధ మార్గాల్లో ఆరు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ (నెంబర్: 47128), హైదరాబాద్-లింగంపల్లి (నెంబర్: 47104), లింగంపల్లి-ఫలక్‌నుమా (నెంబర్: 47173, 47179), ఫలక్‌నుమా-లింగంపల్లి (నెంబర్: 47211, 47155) ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.