Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్.. హీరో సూరి కాంబినేషన్ లోతెరకెక్కుతున్న విడుదలై. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ చిత్రాలను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టంట్ మాస్టర్ సురేష్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. తీవ్ర గాయలాపాలైన ఆయనను చికితిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. స్టంట్ మాస్టర్ మృతితో తమిళ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని కేలంబక్కంలో చోటు చేసుకొన్నది. ఈ లో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించనున్నారు. చెన్నై శివారులోని వండలూరు సమీపంలోని ఉనమంచెరిలో సన్నివేశం కోసం రైలు పట్టాల సెట్‌ను నిర్మించారు. అందులో రైలు ప్రమాదానికి గురయినట్టుగా చిత్రీకరిస్తున్నారు. శనివారం ఉదంయ సురేష్ తో సహా కొంతమంది నటులను భారీ క్రేన్‌కు బిగించి తాళ్లతో కట్టివేశారు. తాత్కాలికంగా నిర్మించిన రైలు వంతెన కూలిపోవడంతో సురేష్ కిందపడి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన పై కేసు నమోద చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.