Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హబ్సిగూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. జెట్ స్పీడ్‌తో వాహనాలపైకి దూసుకెళ్లింది. ఫ్రెండ్స్‌తో కలిసి అర్థరాత్రి వరకు పార్టీ చేసుకొని యువకులు మద్యం మత్తులో కారు నడిపారు. కారును జెట్ స్పీడుతో డ్రైవ్ చేస్తూ యువకులు భీభత్సం చేశారు. హబ్సీగూడలో కారుతో ఆటోను ఢీకొట్టారు. దీంతోపాటు ఓ స్కూటీని కూడా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రకారం ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిలో ఆటో, స్కూటీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. నుజ్జునుజ్జయిన వాహనాలను చూస్తేనే ప్రమాదం తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.