Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కొన్నిరోజుల కిందట చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఘటన స్థలంలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆయుధాల్లో అమెరికా తయారీ తుపాకీ కూడా లభించింది. దానిని ఎం1 కార్బైన్ తుపాకీగా పిలుస్తారు. దీన్ని అమెరికా బలగాలు రెండో ప్రపంచ యుద్ధంలోనూ, వియత్నాం యుద్ధం, కొరియా వార్ లోనూ ఉపయోగించాయి. ఎం1 కార్బైన్ తుపాకీ బ్యారెల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇతర అస్సాల్ట్ తుపాకులతో పోల్చితే దీని నిర్వహణ, వినియోగం చాలా సులభం అని పోలీసులు తెలిపారు. తుపాకీపై ఉండే సీరియల్ నెంబర్ ఆధారంగా నక్సల్స్ కు ఎలా అందిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేయనున్నారు.