Authorization
Sat May 17, 2025 01:07:27 am
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓ వింత ఘటన జరిగింది. ఇల్లందు పట్టణంలోని రెండవ బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ తరుణంలో స్థానిక సింగరేణి జిఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసింది. దీంతో ఆగ్రహం చెందిన వేసిన జీఎం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సుందర్‌లాల్‌నుపిలిపించి జిఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసినందుకు ఫిర్యాదు అందిందని అందుకు కేసు నమోదు చేసి కోర్టు కు పంపిస్తామని అన్నారు.
ఎద్దు మూత్రం పోస్తే కేసు పెట్టడం ఏంటి సార్ అని అడగగా దీంతో కేసు నమోదయిందని కోర్టుకి వెళ్ళి ఫైన్ చెల్లించాలని చెప్పినట్లు సుందర్‌లాల్ తెలిపారు. చెల్లించకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని అన్నారని, కిరాయికి తోలుకొని జీవించే నాకు ఎద్దులను పోషించే కష్టమవుతున్న క్రమంలో మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటి సార్ అని పోలీసుల ఎదుట బాధపడుతుండడంతో స్థానిక కోర్టు పోలీస్ కానిస్టేబుల్ స్పందించి స్థానిక ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో అతనికి ఫైన్ చెల్లించి రసీదు ఇవ్వడం జరిగింది.