Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశాన్ని చుట్టేస్తున్నారు.
ఈ యాత్రకు ఆయా రాష్ట్రాల్లో విశేష స్పందన లభిస్తోన్న ఈ తరుణంలో రాహుల్ బాటలో నడిచేందుకు సోదరి ప్రియాంక గాంధీ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది రెండు నెలలపాటు ప్రియాంక మహిళా మార్చ్ ను నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. జనవరి 26 నుంచి మార్చి 26 వరకు పాదయాత్ర కొనసాగుతుందని, అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ ఇది జరుగుతుందని ఆయన వివరించారు. అయితే రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక మహిళా మార్చ్ ప్రారంభించడం విశేషంగా మారనుంది.