Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమీని అనే 22 ఏళ్ల కుర్దు యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల చిత్రహింసలతో వారి కస్టడీలోనే అమీని సెప్టెంబర్ 16న చనిపోయారు. దీంతో నాటి నుంచి హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజధాని టెహ్రాన్ సహా దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ఆందోళనలను అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకారులపై కాల్పులకు ఆదేశించింది. అయినా ఇరాన్ మహిళలు వెనక్కు తగ్గకపోగా, మహిళలకు రోజురోజుకూ మద్దతు పెరిగి ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ఈ సమయంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేసింది. మొరాలిటీ పోలీసింగ్‌కు న్యాయవ్యవస్థతో సంబంధం లేదని అందుకే రద్దు చేస్తున్నామని అటార్నీ జనరల్ మొహ్మద్ జాఫర్ మొంటాజెరి ప్రకటించారు. అయితే ఈ విజయం ముమ్మాటికీ ఇరాన్ మహిళల విజయం.